పద్మశాలి సేవా సంఘం, యువజన సంఘాల ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్థంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోర హనుమాన్లు, పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు తాటిపాముల విశ్వనాథం, కార్యదర్శి మామిడాల లక్ష్మీనారాయణ, యువజన సంఘం అధ్యక్షులు ఆడెపు నర్సయ్య, ప్రధాన కార్యదర్శి కడకుంట్ల నరేష్, సహాయ కార్యదర్శి సామల్ల సతీష్, ఎలిగెటి సతీష్, కోశాధికారి బీమనతి నరేష్, బిసి సంఘ నాయకులు మాచర్ల మారుతి, ఎలిగేటి అనిల్, వాసం రాజేందర్, శ్రీపతి లక్ష్మీనారాయణ, కడకుంట్ల జగదీశ్వర్, అంగరి శ్రీధర్, రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.