టిఆర్ఎస్ తోనే గ్రామాల్లో అభివృద్ధి సాధ్యం - ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి.

కుచ్చరకల్ గ్రామ మాజీ సర్పంచ్ యాదగిరి తో సహా 50 మంది కాంగ్రేస్ నాయకులు టిఆర్ఎస్ పార్టీలో చేరిక. 

రాజాపూర్ ,అక్టోబర్ 03,(ప్రాంతం న్యూస్ ): తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత టిఆర్ఎస్ ప్రభుత్వంతోనే గ్రామాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పధకాలను చూసి టిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు పలువురు నాయకులు, యువత స్వచ్చందంగా ముందుకు వస్తున్నారని అన్నారు.

రాజపూర్ మండలం కుచ్చరకల్ గ్రామంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ యాదగిరి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నర్సిములు తో పాటు (50) మంది కాంగ్రెస్ నాయకులు స్థానిక యువనేత దొండ్లపల్లి ఎంపీటీసీ అభిమన్యు రెడ్డి గారి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. కొత్త సభ్యులకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు గులాబీ కండువా కప్పి టిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు.