రాష్ట్రానికి , దేశానికి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష

బిజెపికి ప్రత్యామ్నాంగా దేశంలో వచ్చేది కేసీఆర్ పాలనే

కాంగ్రెస్ రెండవ స్థానాన్ని నిలుపుకోవడం కష్టం

నేటికీ, ఎన్నటికీ మునుగోడులో బిజెపి అభ్యర్థికి మూడో స్థానమే

– రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి

సూర్యాపేట ప్రాంతం న్యూస్ 21: సీఎం కేసీఆర్ నాయకత్వమే రాష్ట్రానికి , దేశానికి శ్రీరామరక్ష అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.సూర్యాపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి మీడియాతో మాట్లాడుతూ… గడిచిన 8ఏళ్ళలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్, విద్యా , పారిశ్రామిక రంగాల్లో సాధించిన ప్రగతినే దీనికి ఉదాహరణ అన్నారు.ప్రజలకు ఏమి కావాలో తెలుసుకుని వాటికి అనుగుణంగా సంక్షేమ పథకాలను రూపొందించి వాటి ఫలాలను ప్రజలకు అందించే కేసీఆర్ పాలనను దేశవ్యాప్తంగా మేధావులు , దేశంలోని ప్రముఖులు కోరుకుంటున్నారని అన్నారు.రాబోయే రోజుల్లో దేశంలో బిజెపికి ప్రత్యామ్నాయం కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం నిలబడబోతుందని జోస్యం చెప్పారు.రాబోయే
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.కాంగ్రెస్ రెండవ స్థానాన్ని నిలుపుకోవడం కష్టమని, ఆ పార్టీకి నాయకత్వ లోపం పెద్ద శాపమన్నారు.ఆ మాట కోస్తే జాతీయ స్థాయిలో కూడా నాయకత్వ లేమి కాంగ్రెస్ పార్టీనీ వెక్కిరిస్తుందన్నారు.రాష్ట్రంలో పార్టీ నేతలను జోడించలేని రాహుల్ గాంధీ జోడో యాత్ర చేయడం హాస్యాస్పదమన్నారు.రాష్ట్రలో కాంగ్రెస్ కు కనుచూపు మేరలో కూడా అవకాశాలు లేవన్నారు.ఇక పార్టీగా బిజెపికి తెలంగాణలో స్థానమే లేదన్నారు.రాష్ట్రంలో వ్యక్తులతోనే అక్కడో ఇక్కడో బిజెపి కాలం వెళ్లదీస్తుందన్నారు.బిజెపి విభజన రాజకీయాలను చైతన్యవంతమైన తెలంగాణ సమాజం ఒప్పుకోదని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి పార్టీ అభ్యర్థికి నేటికీ, ఎన్నటికీ మూడో స్థానమేనని అన్నారు.