కరీంనగర్ టౌన్ సెప్టెంబర్ 21ప్రాంతం న్యూస్ :
రాష్ట్రంలోని పెంచిన ఇంజనీరింగ్ ఫీజులను తక్షణమే బేషరతుగా తగ్గించాలని ఎఐఎస్‌బి రాష్ట్ర ప్రధానకార్య దర్శి గవ్వ వంశీధర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలకు ఫీజుల పెంపు పై ఉన్న చిత్తశుద్ధి వారి కళాశాలల్లో విధ్యార్థులకు మౌలిక వసతులు కల్పించడం పై లేదు అని రాష్ట్రంలో అన్ని ఇంజనీరింగ్ కళాశాలలకు ఒకే రకమైన ఫీజును నిర్ణయించాలని డిమాండ్ చేశారు. కళాశాల యాజమాన్యాలు కోర్టుకు వెళ్ళి ఫీజులు పెంచేల తీర్పు తేచ్చుకోని విధ్యార్థుల నుండి లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారని మండ్డిపడ్డారు. వారికి ఎఐసిటిఇ జెన్‌టియు ఉన్నత విద్యమండలి ఒయు సైతం వత్తాసు పలికే విధంగా నామమాత్రపు పర్యవేక్షణ చేసి అనుమతి రిన్యువల్ చేయడం సమంజసం కాదు అన్నారు.
అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హాస్టలల్లో వరుస ఫుడ్ పాయిజన్ లతో విధ్యార్థులు నాన ఇబ్బందులు పడుతున్నారని మరోవైపు విషజ్వరాతో విధ్యార్థులు ఇబ్బంది పడుతుంటే అధికారులు, నామామత్రపు తణికీలు చేయడం భాధాకరం అని అన్నారు. ఫుడ్ పాయిజన్లు జరగకుండా నాన్యమైన భోజనం అందించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎఐఎస్‌బి రాష్ట్ర కార్యదర్శి మొలుగురి హరికృష్ణ , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల హరీష్ రెడ్డి, నాయకులు కళికోట అభిలాష్ ,నీరజ్,కార్తీక్ తదితరులు పాల్గోన్నారు.
0 Comments